‘యానిమల్’ సక్సెస్ తర్వాత నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన రెమ్యునరేషన్ రూ.4 కోట్లకు పెంచినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై ఓ నెటిజన్ ట్వీట్ చేయగా రష్మిక దానికి రిప్లై ఇచ్చారు. ఈ విషయం తనకి ఎవరు చెప్పారని ప్రశ్నించిన ఆమె.. ఇది చూసిన తర్వాత నిజంగానే తన రెమ్యునరేషన్ గురించి ఓసారి ఆలోచించాలనుకుంటున్నానని చెప్పారు. నిర్మాతలు అడిగితే సోషల్ మీడియాలో వచ్చిన దానికి కట్టుబడి ఉండాలనుకుంటున్నట్లు చెప్తానన్నారు.





