తనకు తానే గర్భాశయ క్యాన్సర్‌తో చనిపోయినట్లుగా ప్రకటించుకున్న నటి పూనమ్ పాండే టాపిక్ ఇప్పుడు దుమారం రేపుతోంది. శుక్రవారం పూనమ్ గర్భాశయ క్యాన్సర్‌తో చనిపోయినట్లు ప్రచారం జరిగింది. మరుసటి రోజు తాను చనిపోలేదని కెమెరా ముందుకు వచ్చింది. దాంతో ఆమెపై పలువురు మండిపడ్డారు. కోల్‌కతాకు చెందిన అమిత్ రాయ్ అనే వ్యక్తి కోర్టులో ఫిర్యాదు చేశాడు. ఆమె క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. దాంతో పూనమ్ పాండేకు నోటీసులు వెళ్లినట్లు సమాచారం





