పేటీఎంపై ఆర్‌బీఐ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దాంతో యూజర్లు పేటీఎం స్థానంలో ఇతర పేమెంట్ యాప్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. నాలుగు రోజుల్లోనే ఫోన్ పే, గూగుల్ పే, భీమ్-యూపీఐ యాప్‌లు గణనీయంగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ నెల 3న ఫోన్‌పేను 2.79 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నట్లు ‘యాప్ ఫిగర్స్’ తెలిపింది.