‘ఫిల్మ్‌ఫేర్’ అవార్డుల్లో ఉత్తమ నటి కేటగిరీలో రష్మికకు నామినేషన్ దక్కకపోవడంపై దర్శకుడు సందీప్ వంగా స్పందించారు. ఈ విషయంలో తాను షాక్‌కు గురైనట్లు చెప్పారు. ‘‘యానిమల్’లో గీతాంజలి పాత్రలో నటించడం అంత సులభమేం కాదు. ఒక్క సన్నివేశంలోనే చాలా హావభావాలు పలికించాలి. నాకు అవార్డుల మీద నమ్మకం లేదు. ‘ఫిల్మ్‌ఫేర్’లో ‘యానిమల్’ 19 కేటగిరీల్లో నామినేషన్లు దక్కించుకుంది. ఆరు కేటగిరీల్లో సత్తా చాటింది‘‘ అని తెలిపారు.
