భారతీయులకు వీసా మినహాయింపు ఇచ్చే దేశాల జాబితాలో ఇరాన్ చేరింది. ఈ నెల 4 నుంచి కొన్ని షరతులతో ఎత్తి వేస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. భారతీయ పర్యాటకులు 15 రోజులపాటు వీసా లేకుండానే తమ దేశంలో పర్యటించడానికి అనుమతి ఇస్తున్నట్లు ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం వెల్లడించింది. విమాన మార్గంలో వచ్చే ప్రయాణికులకే ఇది వర్తిస్తుందని తెలిపింది.