మాల్దీవుల నుంచి భారత బలగాలు వెళ్లిపోవాలని ఆ దేశ అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు అన్నారు. మే 10లోపు భారత బలగాలను వెనక్కి పంపుతామని ఆయన పేర్కొన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ‘మా పాలకవర్గానికి దేశ ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. భారత బలగాలు వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేశాం. దీనిపై చర్చలు జరుగుతున్నాయి. మార్చి 10లోపు కొందరిని, మే 10లోపు మిగిలిన బలగాలను వెనక్కి పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం.’ అని ముయిజ్జు అన్నారు.