డైరెక్టర్ బోయపాటి శ్రీను, అగ్ర నిర్మాత అల్లు అరవింద్ కాంబోలో మరో మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలకృష్ణ హీరోగా బోయపాటి తెరకెక్కించనున్న ‘అఖండ-2’ చిత్రానికి అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించనున్నారనే వార్తలు టీటౌన్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, వీరిద్దరి కాంబినేషన్లో గతంలో సరైనోడు సినిమా రాగా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.
