బాలీవుడ్ స్టార్ హీరోయిన్ యామీ గౌతమ్ తల్లి కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె తన భర్త, డైరెక్టర్ ఆదిత్య ధర్ తో కలిసి “ఆర్టికల్ 370′ చిత్ర ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో మీడియాకు తెలిపారు. తాము త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నట్లు ప్రకటించారు. 2021లో రచయిత, డైరెక్టర్ ఆదిత్య ధర్ తో యామీ వివాహం జరిగింది. కాగా యామీ గౌతమ్.. నువ్విలా, గౌరవం, యుద్ధం, కొరియర్ బాయ్ కళ్యాణ్ తదితర చిత్రాల్లో నటించారు.
