UPDATES  

 మళ్లీ వస్తోన్న ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’..

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ మూవీ ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’. 2008లో విడుదలైన ఈ మూవీ అప్పట్లోనే భారీ వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ క్రమంలో గతేడాది ఆగస్టు 4న రీరిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో తాజాగా మరోసారి రీరిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. వాలంటైన్స్ డే సందర్భంగా ఈ నెల14న ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ రీరిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !