అయోధ్యలో రామమందిరం నిర్మాణంతో ప్రపంచ దేశాల చూపు ఇండియా వైపు చూస్తోంది. ఒక్కసారిగా అయోధ్యకు పర్యాటకుల తాకిడి రోజు రోజుకు పెరుగుతోంది. అయోధ్యను దర్శించుకునేందుకు వచ్చే వారు అక్కడ రుచులను ఆస్వాదిస్తున్నారు. రామాలయానికి కిలో మీటర్ దూరంలో ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు అయ్యాయి. ఇక్కడ KFC ఏర్పాటుకు అనుమతి లభించింది. కానీ ఇందులో శాఖాహారం మాత్రమే అమ్మాలని, మాంసాహారం అమ్మేందుకు వీలు లేదనే షరతులు పెట్టారు.