UPDATES  

 నేనే రాజు నాకు ఎదురే లేరు..పెట్టుబడులు పెట్టిన రేసింగ్ కాంట్రాక్టర్ నిండా ముంచిన ఘనుడు..

  • నేనే రాజు నాకు ఎదురే లేరు
  • పెట్టుబడులు పెట్టిన రేసింగ్ కాంట్రాక్టర్ నిండా ముంచిన ఘనుడు
  • బడ బాబు తో చేతులు కలిపి తప్పుడు లెక్కలు చూపించి ప్రాణాల మీదికి తెచ్చిన వీరుడు
  • పంచాయతీ కార్యదర్శి నుండి జిల్లా కలెక్టర్ వరకు బడా బాబుకు బానిసలేనా!?
  • గోదావరి నది గర్భాన్ని చీల్చుతూ రహదారులు సైతం తన సొంతం చేసుకున్న పట్టించుకునే వారే లేరా!?

మన్యం న్యూస్ చర్ల.

 

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం చర్ల మండల పరిధిలో ఉన్న కొత్త పెళ్లి గిరిజన సొసైటీ అధ్యక్షురాలు భర్త సొసైటీ పేరుతో బడా బాబులకు వలవేసి వారి నుండి భారీ పెట్టుబడులు పెట్టించి మోసగించీ నేను ఎస్టీ నన్ను ఏమి చేయలేరు అంటూ సమాజంలో ఇదేచ్ఛగా చలామణి అవుతున్నరు అనే ఆరోపణలు గట్టిగానే ఉన్నాయి. అయితే ఆ కీచకుడుకి ఒక బడా కాంట్రాక్టర్ అండదండలతోనే అధికారులు సైతం బానిసలుగా మార్చుకుంటున్నారు అనే గుసగుసలు అధికమే, అయితే పెట్టుబడులు పెట్టిన వారికి తప్పుడు లెక్కలు చూపిస్తూ వారి ప్రాణాలు హరించి వేస్తున్న సంఘటనలు చూసి జిల్లాలో ఉన్న ఒక్క అధికారి కూడా పట్టించుకునే పరిస్థితి లేదు అంటూ స్థానికులు మండిపడుతున్నారు. ఎవరైనా మానవత్వం కలిగిన వారు ప్రశ్నిస్తే వారిపై దాడులు చేస్తూ కొత్త పెళ్లి గిరిజన సొసైటీ పేరుతో చెయ్యని అరాచకాలు లేవు అనే కొత్త పెళ్లి గ్రామంలోనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చర్ల మండలం కొత్తపల్లి గిరిజన సొసైటీ పేరుతో లక్షల రూపాయలు ఆదాయం ఉంటుంది అంటూ నమ్మిస్తూ పగిడిమర్రి శ్రీనివాసు తో పెట్టుబడును పెట్టించి మీరు మాకు అడిగినంత డబ్బు ఇవ్వాలి అంటూ వారిని భరించలేని ఇబ్బందులు పెడుతున్న క్రమంలో ఆ బాధలు తట్టుకోలేని పగిడిమర్రి శ్రీనివాస్ 50 నిద్ర మాత్రలు మింగి కోమాలో ఉన్నారని తెలుసుకున్న మీడియా వారి ప్రాణాలు నిలబెట్టింది శ్రీనివాస్ బ్రతికి ఉన్నారనే విషయం తెలుసుకున్న కీచకుడు మరోసారి గోదావరి అమ్మ గర్భాన్ని అర్ధరాత్రి చీల్చుతూ కొత్త పెళ్లి గ్రామానికి వెళ్లే రహదారిని సైతం తన పార్కింగ్ యాడ్ గా మార్చుకున్నారు అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఒకవైపు గోదావరి గర్భాని చీల్చుతూ మరోపక్క గ్రామస్తులను ఇబ్బంది పెడుతున్న సంబంధిత రెవెన్యూ అధికారులు కానీ టీఎస్ఎండిసి అధికారులు కానీ మైనింగ్ అధికారులు కానీ పట్టించుకునే పరిస్థితి లేదు అంటూ కన్నీరు పెట్టుకునే పరిస్థితులు నిత్యం దర్శనమిస్తున్నాయి.అయితే స్థానికులు మాత్రం గ్రామపంచాయతీ కార్యదర్శి నుండి కలెక్టర్ వరకు ప్రతినెల ముడుపులు పంపుతున్నారనే ఆరోపణలు గట్టిగానే ఉన్నాయి అయితే ఇలాంటి వారికి అసలు ఇసుక క్వారీలు తీయకుండా మూసివేయాలనే నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ కళ్ళు తెరిచి గిరిజన సొసైటీ పేరుతో భారీ మోసాలు చేసే కొత్త పెళ్లి గిరిజన సొసైటీని వెంటనే మూసివేయాలని నియోజకవర్గ ప్రజలు ముక్తకంఠంతో వేడుకుంటున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !