మన్యం న్యూస్, మంగపేట.
మంగపేట మండలం లోని జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యం లో మన మాజీ ప్రధాని తెలంగాణ ముద్దుబిడ్డ పి వి నర్సింహా రావు కు దేశ అత్యున్నత భారతరత్న పురస్కార్ అవార్డు దక్కడం పట్ల జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ వారు హర్షం వ్యక్తం చేశారు .ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్ పేర్కొన్నారు. పి వి నరసింహారావు కు భారతరత్న పట్ల కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధానకార్యదర్శి మునిగాల రాకేష్ , కార్యదర్శి ఆత్మకూరి సతీశ్, గౌరవసలహదారులు సయ్యద్ బాబా గారు, కార్యవర్గ సబ్యులు సురేష్,రమేష్,ఇంత్యాజ్, అంరోజ్,మిగతా సభ్యులు పాల్గొన్నారు.