- మన్యం కథనానికి స్పందన
- పిఓ ఆదేశాలతో కదిలిన జిసిసి యంత్రాంగం
- ముష్టి గింజల ద్వారా 22,23 సంవత్సరానికి మూడు కోట్ల ఆదాయం ఈసారి దానికి గండి
మన్యం న్యూస్ గుండాల: సరిహద్దులు దాటుతున్న అడవి సంపద కథనానికి స్పందించిన భద్రాచలం పిఓ. పిఓ ఆదేశాలతో కదిలిన జిసిసి యంత్రాంగం. ఇల్లందు డివిజన్ పరిధిలోని జిసిసి మేనేజర్ పరిధిలో గల గిరిజన సహకార సంస్థ షాపులన్నిటికీ స్పష్టమైన ఆదేశాలు రావడంతో జిసిసి సేల్స్ మేన్లు ముష్టి గింజల సమాచార సేకరణను ప్రారంభించారు ఎవరెవరి దగ్గర ఎన్ని గింజలు ఉన్నాయని ఆధార్ కార్డును సైతం సేకరించాలని ఆదేశాలు రావడంతో గురుకుల పరుగుల మీద అధికారులు సేకరణను ప్రారంభించారు. 2022,23 సంవత్సరానికి మూడు కోట్ల రూపాయల ఆదాయం రావడం ఇప్పటివరకు ఈ ఏడాదికి సేకరణ చేపట్టకపోవడంతో ఆదాయం మార్గం మూసుకుపోయిందని సమాచారం. డిసెంబర్ నెల నుండి ముష్టి గింజల సీజన్ ప్రారంభమైనప్పటికీ జిసిసి ద్వారా ప్రారంభం కాకపోవడంతో ఆదాయానికి గండి పడినట్టే. ఇప్పటికైనా అధికారులు స్పందించి దళారి చెంతకు చేరకుండా జిసిసి ద్వారా సేకరణ చేస్తే జిసిసికి ఆదాయంతో పాటు గిరిజనులకు కొంతమేర డబ్బు సమకూరినట్లు అవుతుందని మండల ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు