టాలీవుడ్ స్టార్ దర్శకుడు బోయపాటి శ్రీను, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌ల కాంబోలో త్వరలో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చే మూవీకి సంబంధించి మరో క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌లో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
