రైలు పట్టాలపై రైళ్లు ఢీకొని వన్యప్రాణులు మృతి చెందిన ఘటనలు దేశవ్యాప్తంగా అనేకం ఉన్నాయి. ముఖ్యంగా ఏనుగులు రైలు పట్టాలు దాటడం వల్ల చనిపోతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు తమిళనాడు అటవీ శాఖ తాజాగా AI ఆధారిత హెచ్చరిక వ్యవస్థను తీసుకొచ్చింది. ఈ ఏఐ టెక్నాలజీ ఏనుగులు రైల్వే ట్రాక్‌లను దాటుతున్నప్పుడు వాటి కదలికను గుర్తించి, ట్రాక్‌లకు దగ్గరగా వచ్చి అధికారులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తుందని సమాచారం.