UPDATES  

 విద్యారంగానికి అరకొర నిధులు కేటాయించడం సరైనది కాదు..పీ డీ ఎస్ యు జిల్లా అధ్యక్షులు రాజేష్..

మన్యం న్యూస్ గుండాల:

విద్యారంగానికి అరకొర నిధులు కేటాయించడం సరైనది కాదు.బడ్జెట్ ను సవరించి నిధులు పెంచాలని పీ డీ ఎస్ యు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి ఇర్ప రాజేష్ శనివారం అన్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో బడ్జెట్ లో విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చిందని, కాని 31389 కోట్లు మాత్రమే కేటాయించిందని, మొత్తం 2,75,891 కోట్ల రాష్ట్ర బడ్జెట్ లో ఇది కేవలం 11.3% నిధులు మాత్రమేనని ఆవేదన వ్యక్తం చేశారు.ఎప్పటినుండో విద్యావేత్తలు,మేధావులు, విద్యార్థి సంఘాలు విద్యారంగం బాగుపడాలంటే కనీసం విద్యారంగానికి బడ్జెట్ లో 30% నిధులు కేటాయించాలని కోరుతున్నారని, నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ను చూస్తే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందని స్పష్టంగా అర్థమవుతుందని ఎద్దేవా చేశారు.ఇప్పటికే దాదాపు 6500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ పెండింగ్ లో ఉన్నాయని, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు కనీస సదుపాయాలు లేక కూనరిల్లుతున్నాయి మండిపడ్డారు.విద్యారంగం బాగుపడాలంటే ఈ నిధులు సరిపోవని, బడ్జెట్ ను సవరించి విద్యారంగానికి మరిన్ని నిధులు కేటాయించాలని పీ డీ ఎస్ యు డిమాండ్ చేస్తుందని అన్నారు.లేని యెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చెప్పడతామని హెచ్చరించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !