UPDATES  

 పైన పటారం లోన లొటారం…బొక్కలతో దర్శనమిస్తున్న ఆర్టీసీ బస్సులు…

  • పైన పటారం లోన లొటారం.
  • బొక్కలతో దర్శనమిస్తున్న ఆర్టీసీ బస్సులు.
  •  మరమ్మత్తులు మరిచి బస్సుకు కలర్ వేసి మభ్యపెడుతున్న ఆర్టీసీ యాజమాన్యం.
  • ప్రజల ప్రాణాలను హరించి వేస్తున్న పాత బస్సులు.
  •  క్షణక్షణం భయాందోళనలో ప్రయాణికులు.
  • కొత్త బస్సులు వేయండి అంటూ వేడుకోలు.

 

మన్యం న్యూస్ నూగూరు వెంకటాపురం.

 

 

వెంకటాపురం మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సు ప్రయాణం అగమ్య గోచరంగా మారింది. బస్సు ఎక్కాలంటే చాలు గుండెల్లో భయం పెట్టుకొని ఎక్కాల్సిందే అన్న చందానంగా బస్సు లోపల భాగం అంతా శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితులు కనబడుతున్నాయి . బస్సు పైకి కొత్తగా కలర్ వేసి కనబడుతున్న లోన మాత్రం క్యాబిన్ దగ్గర నుండి చివర సీటు వరకు ప్రయాణికులను భయాందోళన గురి చేసే పెద్ద పెద్ద బొక్కలు దర్శనమిస్తున్నాయి.

చుట్టూ మూడు అంగుళాల నుంచి 5 అంగుళాల వెడల్పుతో పడ్డ బొక్కలలో చిన్నపిల్లల కాళ్లు సరిగ్గా సరిపోయేంత విడివి ఉండడం ప్రయాణికులను ఆందోళన కలిగిస్తున్నాయి.

అసలే మేడారం సీజన్ కావడంతో మేడారం టు వెంకటాపురం నిత్యం కొన్ని వేల మంది ప్రయాణికులతో తిరిగే ఆర్టీసీ బస్సులు, ఈ విధంగా ఉండడం చాలా బాధాకరమని ఎంత ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన,ఇలా శిథిలావస్థలో ఉన్న బస్సులు పెట్టడం చాలా ఇబ్బందిగా ఉంది అంటూ,ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు . మొత్తం భద్రాచలం నుండి 17 బస్సులు కాగా, వరంగల్ నుంచి డిపో 2 ద్వారా 5 బస్సుల సర్వీసులు నిత్యo నడుస్తున్నాయి. అయితే పేరుకు అందుబాటులో అన్ని బస్సు సౌకర్యాలు ఉన్నా, బస్సు లోన కింద నడిచే అల్యూమినియం మ్యాట్ కు పడ్డ బొక్కలు ఆందోళన కలిగిస్తున్నాయి అని, అవి కనబడకుండా పైన రాళ్లు అమర్చి గుడ్డ కప్పారు అంటూ ప్రయాణికులు వాపోతున్నారు. చూసుకోకుండా ఎవరైనా దానిలో కాలు పడి ప్రమాదానికి గురవుతే దానికి బాధ్యులు ఎవరు అంటూ ఆర్టీసీ యాజమాన్యంపై ప్రయాణికులు ధ్వజమెత్తుతున్నారు.

ఇలాంటి బస్సులలో ప్రయాణం చేస్తే మేడారం పోయేలోపు మధ్యలోనే ప్రాణాలు హరించకపోతాయంటూ మండిపడుతున్నారు.

బస్సుల పరిస్థితి ఇలా ఉంటే, మరోవైపు వెంకటాపురం బస్టాండు ఇంకా శిధిలాస్థితికి చేరుకొని రేపు మా పో కూలీపోయే విధంగా ప్రమాదకంటికలు మోగిస్తుందని,

దీని పట్ల సంబంధిత అధికారులు సరైన మరమ్మతులు చేయించకుండా ఉన్న బస్టాండ్ కి కలర్లు వేసి మసిపూసి మారేడు కాయ చేస్తున్న పరిస్థితులు చాలా దారుణం అని అన్నారు. 1989లో కట్టించిన వెంకటాపురం బస్సు షెల్టర్ నుఇంతవరకు పట్టించుకున్న నాథుడు లేడు అని,దానికి నిధులు శాంక్షన్ అయినా మరమ్మతులకు మాత్రం నోచుకోవడం లేదు అంటూ. ప్రయాణికులు మండల ప్రజలు వాపోతున్నారు.

గట్టిగా వాన పడితే బస్టాండ్ అంతా కురుస్తున్న పరిస్థితులు వాన కాలంలో దర్శనమిస్తాయి అని వర్షానికి బస్టాండు పైన వేసిన బీములు చిప్స్ మొత్తం రాలిపోయి రాడ్లు బయటపడ్డ పరిస్థితి. ఇప్పుడు భయాన్ని కలిగిస్తున్నాయని ప్రయాణికులు అధికారుల నిర్లక్ష్యాన్ని చూపిస్తూ ఎండ కడుతున్నారు.

ప్రయాణికులు కూర్చోవడానికి కట్టిన దిమ్మెలు కూడామొత్తం పగుళ్లు తేలి పాములకు తేళ్లకు కీరవైనట్లు ప్రమాద స్థాయికి చేరుకున్నాయని.. ఇకనైనా ఉన్నత అధికారులు బస్సులపై మరియు వెంకటాపురంలో ఉన్న బస్టాండ్ పై తగు చర్యలు తీసుకొని వెంటనే శిథిలావస్థలో ఉన్న బస్సులను నిలిపివేసి కొత్త బస్సులను వేయాలని శిధిలావస్థలో ఉన్న బస్టాండ్ ను ప్రజలకు త్వరగా ఉపయోగపడేలా మరమ్మత్తులు చేయించి, ప్రయాణికులకు అందించాలని మండల ప్రజలు కోరుతున్నారు..

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !