సినీ రంగంలో ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డుల్లో కొత్త కేటగిరీ చేరనుంది. ఇకపై ఉత్తమ కాస్టింగ్ కేటగిరీలోనూ ఈ అవార్డు అందజేయనున్నారు. నటీనటుల ఎంపికలో కాస్టింగ్ బృందం సాధించిన విజయాలను గుర్తిస్తూ నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, 2026 నుంచి ఈ అవార్డును అందజేయనున్నట్లు వెల్లడించారు. కాగా, ప్రస్తుతం 23 విభాగాల్లో ఆస్కార్ అవార్డులు ప్రదానం చేస్తుండగా, దీంతో అది 24కు చేరింది.
