రవితేజ హీరోగా నటించిన ఈగల్ మూవీ ఈనెల 9న థియేటర్లలో విడుదలైంది. ఈ సందర్భంగా ఈ మూవీ గురించి పలు విషయాలను పంచుకున్నారు డైరెక్టర్ కార్తీక్. ‘కొన్ని కి.మీ ఎత్తులో ఉన్నా ఈగల్ భూమిపై ఉండే వాటిని స్పష్టంగా చూడగలదు. ఈ మూవీలో హీరోకి అలాంటి ఐ పవర్ ఉంటుంది. పైగా ఈ క్యారెక్టర్ కోడ్ నేమ్ కూడా ఈగల్. అందుకే ఆ పేరు పెట్టాం. అయితే, ఈ టైటిల్‌తో హిందీలో ఓ సినిమా ఉండటంతో సహదేవ్ వర్మ పేరుతో విడుదల చేస్తున్నాం’ అని చెప్పారు.
