ప్రేమికుల రోజు సందర్భంగా పలు సూపర్ హిట్ సినిమాలు రీరిలీజ్ కానున్నాయి. గతేడాదిలో రీరిలీజైనా ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ మరోసారి ఈనెల 14న విడుదలకు సిద్ధమైంది. సిద్ధార్థ్, షామిలీ జంటగా నటించిన ‘ఓయ్’ మూవీ కూడా ఈనెల 14న రీరిలీజ్ కానుంది. అలాగే, సీతారామం, తొలిప్రేమ, నువ్వొస్తానంటే నేనొద్దంటావా, జర్నీ, దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే, దిల్ తో పాగల్ హై, మొహబ్బతే వంటి చిత్రాలు వాలెంటైన్స్ డే రోజు రీరిలీజ్‌కు సిద్ధమయ్యాయి.
