మిస్ వరల్డ్ 71వ ఎడిషన్ పోటీలకు భారత్ వేదిక కానుంది. ఈ నెల 18 నుంచి మార్చి 9 వరకు పోటీలు జరుగనున్నాయి. మూడు దశాబ్దాల తర్వాత భారత్‌లో పోటీలు నిర్వహిస్తున్నట్లు మిస్ వరల్డ్ అధ్యక్షురాలు జులియా మోర్లే తెలిపారు. న్యూఢిల్లీలో ప్రారంభ వేడుకతో పోటీలు ప్రారంభమై.. మార్చి 9న ముంబైలో ముగుస్తాయి. వివిధ దేశాలకు చెందిన 120 మంది అందెగత్తెలు పోటీల్లో పాల్గొంటారు.