మన్యం న్యూస్, మంగపేట.
ఆదివారం మండలంలోని అకినేపల్లి మల్లారం ఎస్టీ కాలనీ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు లక్కీ వెంకన్న తండ్రి లక్కీ పిచ్చయ్య సంవత్సరికం కార్యక్రమానికి ఆదివారం రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హాజరై కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం స్థానిక గ్రామస్తులు అకినేపల్లి మల్లారం మరియు ఎస్టీ కాలనీ గ్రామాలలో నెలకొని ఉన్న పలు సమస్యలను మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లగా ములుగు జిల్లాకి చిట్ట చివరి గ్రామమైన అకినేపల్లి మల్లారాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైల జైరామ్ రెడ్డి,నాయకులు వల్లిపల్లి శివప్రసాద్, లక్కీ వెంకన్న, ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బంది లక్కీ అనిల్ రాజు,సతీష్,తొండపు సంజీవరెడ్డి, మండల నాయకులు పలువురు పాల్గొన్నారు.