UPDATES  

 రోడ్డె నా పరుపు…తప్ప తాగి కృష్ణుడు మాదిరిగా రోడ్డుమీద పడుకున్న యువకుడు…మందో రక్షిత రక్షితః అంటూ కొత్త శ్లోకం చెప్తున్న ధీరుడు..

  • రోడ్డె నా పరుపు.
  •  తప్ప తాగి కృష్ణుడు మాదిరిగా రోడ్డుమీద పడుకున్న యువకుడు.
  •  మందో రక్షిత రక్షితః అంటూ కొత్త శ్లోకం చెప్తున్న ధీరుడు.
  •  ఇది తీరని దాహం అంటూ
  •  నేటిజెన్లకు కొత్తగా పరిచయం చేస్తున్న మందు బాబు

 

మన్యం న్యూస్ నూగురు వెంకటాపురం.

 

వెంకటాపురం మండల కేంద్రంలో నేటి యువత మందుకు బానిసై ఎక్కడ పడుకుంటున్నారో వారికే అర్థం కావడం లేదు. మండలంలో దొరికే కల్తీ మందులు తాగి

ఆ ప్రభావంతో ఏం చేస్తున్నారో వారికి అర్థం కానంత లోకంలో ఉంటున్నారు. వాహనాలు అటు ఇటు తిరుగుతున్న వారు పట్టించుకోనంతగా తాగిన మందు వారిని పూర్తిగా మింగేసిన కారణంగా

రోడ్డు మీద పడిపోయి లేవలేని పరిస్థితిలో చేరుకుంటున్నారు.

రోడ్డుపై పడుకున్న వారిని ఎవరైనా లేపితే. నేను తీరని దాహం తాగాను ఎవరు నన్ను లేపొద్దు అంటూ .

మందో రక్షిత రక్షితః అనే నినాదాన్ని నెటిజన్లకు కొత్తగా పరిచయం చేస్తున్నారు .

దీన్ని బట్టి చూస్తుంటే వెంకటాపురం మండలంలో మందు ఏ విధంగా ఏరులై పారుతుందో యువత ఏ విధంగా మoదుకు బానిసలు అయ్యారో అర్థమౌతుంది.

మారుమూల గ్రామాలకు సైతం మౌలిక సదుపాయాలు అందని ద్రాక్షగా ఉన్న. ఈ తరుణంలో

మందు మాత్రం పుష్కలంగా ముంచుకొని తాగే అంత లభించడం విశేషం.

ఏది ఏమైనాప్పటికీ ఏజెన్సీ గ్రామాలలో . రేపటి పౌరులు నకిలీ గుడుంబాకు బానిసలై రోడ్ల మీద పడడం అనేది రేపటి భారతాన్ని ఎలా ఊహించాలో అర్థం కాని విధంగా ఉంది అని. మండల ప్రజలు, వారు చేసే చేష్టలు రేపటి నవభారతాన్ని నిర్మిస్తాయా అన్న చందానంగా ఉంటుంది అని పలువురు విమర్శిస్తున్నారు.

ఈ విషయం పట్ల అధికారులు మొద్దు నిద్ర వీడి ఏజెన్సీ గ్రామాలైనటువంటి వెంకటాపురం మండలంలో వాజేడు మండలంలో ఏరులై పడుతున్న గుడుంబను అరికట్టే దిశగా చర్యలు చేపట్టాలని మండల ప్రజలు పిల్లల తల్లిదండ్రులు పత్రికముకంగా కోరుకుంటున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !