నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిస్తున్న మూవీ ‘కల్కి 2898ఏడి’. ఇందులో దీపికా పదుకొణె కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో నటించేందుకు దీపికా రూ.20 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సినీవర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇది ఆమె కెరీర్లోనే అత్యధిక పారితోషికమట. గత చిత్రాలకు ఆమె రూ.15 కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం. అయితే, ఈ మూవీకి డేట్స్ ఎక్కువగా ఇవ్వడంతో భారీ రెమ్యునరేషన్ కోరినట్లు తెలుస్తోంది.