- పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
- పది పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి
- ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేసిన భద్రాచలం ఐటిడిఏ పదవతరగతి ప్రత్యేక అధికారి అశోక్
మన్యం న్యూస్ కరకగూడెం: పదవ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో భద్రాచలం ఐటిడిఏ పదవ తరగతి పరీక్షల ప్రత్యేక అధికారి అశోక్ చిరుమళ్ళ ఆశ్రమ పాఠశాలను సోమవారం సందర్శించారు. పదవ తరగతి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. పదో తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించే దిశగా ప్రతి ఉపాధ్యాయుడు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన కోరారు. అలాగే మెనూ ప్రకారం భోజనం పెట్టాలని, లేనియెడల వారిపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జగన్ వార్డెన్ వట్టం. సంపత్ కుమార్ ఉపాద్యాయులు పాల్గొన్నారు.