- పేదరిక నిర్మూలన మోదీతోనే సాధ్యం
- బీజేపీ జిల్లా అధ్యక్షులు కెవి రంగాకిరణ్
- విజయవంతం అయిన పల్లెకు పోదాం పదండి’ కార్యక్రమం
మన్యం న్యూస్ కరకగూడెం:ప్రధాని మోదీతోనే పేదరిక నిర్మూలన మోదీతోనే సాధ్యం బీజేపీ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కెవి రంగాకిరణ్ పేర్కొన్నారు. పార్టీ తలపెట్టిన ‘పల్లెకు పోదాం పదండి’కార్యక్రమంలో భాగంగ ఆదివారం రాత్రి మండలంలోని అనంతరం గ్రామంలో పార్టీ మండల అధ్యక్షులు గంగినపల్లి నాగేశ్వరరావు స్వగృహంలో పల్లె నిద్ర చేశారు.ఈ క్రమంలో సోమవారం ఉదయాన్నే పలు గ్రామాల్లో స్థానిక నాయకులతో కలసి పర్యటించి గ్రామస్తుల సమస్యలు తెలుసుకొని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కరపత్రాలు పంపిణీ చేస్తూ పథకాల గురించి వివరించారు. అనంతారం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఖాయమని మోదీ హ్యాట్రిక్ కొట్టడం పక్కా అని అన్నారు.అంతేకాకుండా అయోధ్యలో 500 ఏళ్ల హిందువుల రామ మందిరం నిర్మాణ కళను సాకారం చేసిన ఘనత మోదీకే దక్కుతుందని ఆనందం వ్యక్తం చేశారు.ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నిన బీజేపీ విజయాన్ని ఆపలేరని విశ్వాసం వ్యక్తం చేశారు.అలాగే 4,500 కి.మీల మేర జాతీయ రహదారులతో తెలంగాణ రూపురేఖలు మార్చమని
4,136 కి.మీల మేర గ్రామీణ రోడ్ల నిర్మాణం జరిగిందని, 3 వందేభారత్ రైళ్లు, రీజినల్ రింగ్ రోడ్డు, రీజినల్ రేల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేశామని తెలిపారు.ములుగులో సమ్మక్క సారలమ్మ గిరిజన విశ్వవిద్యాలయం, బిబి నగర్లో ఎయిమ్స్ ఏర్పాటుతో పాటు పసుపుబోర్డు ఏర్పాటు, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పున:ప్రారంభించామని అన్నారు.వేగన్ ఫ్యాక్టరీ, టెక్స్ టైల్ పార్క్, హసన్-చెర్లపల్లి ఎల్పీజీ పైప్ లైన్ ప్రాజెక్టులతో పాటు మరెన్నో పరిశ్రమలకు ఊతం కల్పించడంతో పాటు పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని పేర్కొన్నారు. ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, పీఎం కిసాన్, విశ్వకర్మ, గరీబ్ కళ్యాణ్ యోజనతో పేదలకు అసరా ఉన్నాయని హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాటిపాముల ఐలయ్య అసెంబ్లీ కన్వీనర్ పున్నం బిక్షపతి జిల్లా అధికార ప్రతినిధి శ్రీరాం చంద్రయ్య బీజేవైఎం జిల్లా అధ్యక్షులు కొమ్ము వంశీ దంతులూరి రామచంద్రరాజు,పినపాక మండల అధ్యక్షులు దూలిపూడి శివ ప్రసాద్,గోగు అనిల్,పాయం లక్ష్మీనారాయణ,రాజు,నాగమణి,తదితరులు పాల్గొన్నారు.