మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘ఈగల్’. ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల మందుకు రాగా భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. తొలి రోజే రూ.11 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లతో చెలరేగిన ఈగల్.. తర్వాత 2 రోజులు కూడా అదే దూకుడు కొనసాగించింది. మూడు రోజులు కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.30.6 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ ఎక్స్ వేదికగా ప్రకటించింది.