హనుమాన్ సినిమా అనేక రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు వెళ్తోంది. ఈ మూవీ సంక్రాంతి విన్నర్ గా నిలవడమే కాదు 92 ఏళ్ల సంక్రాంతి సినీ రికార్డులు అన్నింటినీ బద్దలు కొట్టింది. హిందీలో రూ.50 కోట్ల క్లబ్‌లో జాయిన్ అయింది. సౌత్ నుంచి వెళ్లి అక్కడ రూ.50 కోట్ల పైగా కలెక్ట్ చేసిన 11వ సౌత్ సినిమాగా హనుమాన్ నిలిచింది. హీరోలలో ఆరవ హీరోగా తేజా నిలిచాడు. ఇప్పటికే ఈ సినిమా సీక్వెల్ జై హనుమాన్ కి సంబంధించిన పనులు మొదలయ్యాయి