‘‘ఎందుకో తెలియదుగానీ ‘హనుమాన్’ కంటే ‘శ్రీ ఆంజనేయం’ చిత్రమే నాకు బాగా నచ్చింది. శ్రీ ఆంజనేయం సూపర్ సినిమా. ప్రేక్షకులకు అది అర్థం కాలేదు’’ అని ఓ సినీ అభిమాని పోస్ట్ పెట్టాడు. దానికి కృష్ణవంశీ రిప్లై ఇస్తూ. ‘‘ప్రేక్షకులదెప్పుడూ తప్పు కాదు. వారికి సినిమా నచ్చలేదంటే ఏదో పొరపాటు జరిగి ఉండొచ్చు లేదా ఆ సినిమా చేరువకావడంలో సమస్య ఉండి ఉంటుంది. అందుకే ఆడియన్స్‌ను నిందించొద్దు’’ అని అన్నారు.