టాలీవుడ్ స్టార్ సుధీర్ బాబు హీరోగా జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘హరోం హర’. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ మూవీ పై భారీ బజ్ ని క్రియేట్ చేసింది. తాజాగా మేకర్స్ ఈ మూవీ ఫస్ట్ సింగిల్‌కి సంబంధించి మరో అప్డేట్ ఇచ్చారు. వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఫిబ్రవరి 14న సాయంత్రం 5 గంటలకు ఈ ఫస్ట్ సింగల్ ని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టర్ ని పోస్ట్ చేసి అధికారకంగా ప్రకటించారు.