ఓ వైపు నటుడిగా ఫుల్ బిజీగా ఉంటూనే దర్శకుడిగానూ వరుస సినిమాలు చేస్తున్నారు సెల్వ రాఘవన్. 7జీ బృందావన్ కాలనీ, ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన ఈ క్రేజీ డైరెక్టర్, వరుసగా హ్యాట్రిక్ సీక్వెల్స్‌ను లైన్‌లో పెట్టారు. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు తెలిసింది. హీరో ధనుష్ నటించిన ’పుధుపేట్టై‘ సినిమా, యుగానికి ఒక్కడు సీక్వెల్స్ తీయునున్నారు.