2022 లో థియేటర్స్ లో విడుదల అయిన ‘మసూద’ మూవీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ హారర్ థ్రిల్లర్ మూవీ అద్భుత విజయం సాధించింది. ఈ సినిమాకి ప్రీక్వెల్ తీయనున్నట్లు ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్ నక్కా తాజాగా వెల్లడించారు. ఎప్పుడు ఈ సినిమా పట్టాలెక్కుతుందో తెలియాల్సి ఉంది.
