సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకువచ్చిన ‘హనుమాన్’ మరో ఆసక్తికర రికార్డును సృష్టించింది. ఇటీవల కాలంలో 30 రోజుల పాటు, అదీ 300లకు పైగా సెంటర్లలో ప్రదర్శించబడుతున్న చిత్రంగా నిలిచింది. తేజ సజ్జా కీలకపాత్రలో ప్రశాంత్ వర్మ రూపొందించిన ఈ మూవీ ఇప్పటివరకూ రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. పెద్ద హీరోల సినిమాలు లేకపోవడంతో ‘హనుమాన్’కు మాత్రం థియేటర్లో ప్రేక్షకాదరణ తగ్గడం లేదు.