మన్యం న్యూస్ గుండాల: దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని అఖిలపక్ష నాయకులు కోరారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకు వస్తున్న రైతాంగ వ్యతిరేక చట్టాలను వెనక్కు తీసుకోవాలని కోరుతూ ఫిబ్రవరి 16వ తారీఖున దేశవ్యాప్త సమ్మె చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ సమ్మెలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు కొమరం శాంతయ్య, సర్పంచ్ కోరం సీతారాములు, వాగబోయిన రమేష్, ఇల్లందుల నరసింహులు, ఈసం కృష్ణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు