మన్యం న్యూస్ గుండాల:అడవి జంతువులను వేటాడడానికి విద్యుత్ తీగలను అమరస్తే కఠిన చర్యలు తప్పవని గుండాల సీఐ ఎల్ రవీందర్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. గతంలో సైతం ఈ విషయం గురించి సర్పంచులు అందరితో సమావేశం ఏర్పాటు చేసి చెప్పామని అన్నారు. విద్యుత్ తీగలు మేడం ద్వారా అడివిలో సంచరించేవారు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. భూపాలపల్లి జిల్లాలో కూబింగ్ ఆపరేషన్ లో పాల్గొన్న కానిస్టేబుల్ అడవి జంతువుల ను వేటాడేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగకు తలిగి దుర్మార్గం పాలయ్యారని అన్నారు. ఇలా విద్యుత్ తీగలను ఏర్పాటు చేసే వారి గురించి సమాచారం ఇవ్వాలని పాడు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు