మన్యం న్యూస్ గుండాల: దేశవ్యాప్తంగా జరగనున్న సమ్మెను జయప్రదం చేయాలని న్యూ డెమోక్రసీ నాయకులు అవనూరి మధు పిలుపునిచ్చారు. మండలం పరిధిలోని బాటన్న నగర్ గ్రామంలో నిర్వహించి అనంతరం ఆయన మాట్లాడుతూ ఈనెల 16వ తారీఖున దేశవ్యాప్త సమ్మె ఉన్నందున ప్రజలు సహకరించాలని కోరారు. కార్మికులు, కర్షకులు, పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తుపాకుల నాగేశ్వరరావు, బండారి ఐలయ్య, పి డి ఎస్ యు జిల్లా కార్యదర్శి రాజేష్, తదితరులు పాల్గొన్నారు