గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ న్యూ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి. చెర్రీ సరికొత్త హెయిర్ స్టయిల్ అభిమానులను ఆకట్టుకుంటోంది. సెలెబ్రిటీ హెయిర్ స్టయిలిస్ట్ అలిమ్ హకీమ్ తాజాగా రామ్ చరణ్ ను ట్రెండీ హెయిర్ కట్ తో అందంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మరో సినిమాలో నటించనున్నారు.