ఆసియా ఖండంలోనే ఆదివాసీల ఆరాధ్య దైవాలైన శ్రీ సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు,జంపన్న, నాగులమ్మ ల జాతరగా పూర్తి ఆదివాసి సంస్కృతి సాంప్రదాయాలతో జరుగుతున్న జాతరలో పూర్తి స్థాయి జాతర ట్రస్ట్ బోర్డ్ వేయకుండా తాత్కాలిక ఉత్సవ కమిటీ పేరుతో గిరిజనేతరులను కూడా మెంబర్లుగా చేయడం ఆదివాసి సంస్కృతి సంప్రదాయాలకు విరుద్ధo అని ఆదివాసి సేన ములుగు డివిజన్ అధ్యక్షులు పోలెబోయిన ఆదినారాయణ ఖండించారు. ఆయన మాట్లాడుతూ మేడారం జాతరను, ట్రస్ట్ బోర్డ్ ను అధికారంలో ఉన్న ప్రభుత్వాలు రాజకీయ కోణంలో చూస్తునారు తప్ప ఆదివాసి సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా పూర్తి స్థాయి జాతర ట్రస్ట్ బోర్డ్ ను నియమించడంలేదని, ఇది ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలను విస్మరించడమే అని తెలిపారు.. జాతరలో ప్రభుత్వ జోక్యం, దేవాదాయ శాఖ జోక్యం లేకుండా పూర్తి పూజారులు, ఆదివాసీలతోనే పూర్తి స్థాయి మేడారం జాతర కమిటీ వేసేలా చర్యలు తీసుకోవాలని, తాత్కాలిక మేడారం ఉత్సవ కమిటీలో గిరిజనేతరులను మెంబర్లుగా ఉండడం వలన ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలు దెబ్బ తినే ప్రమాదం ఉందని అందుకే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవ కమిటీలో గిరిజనేతరుల మెంబర్లను తొలగించి పూర్తిగా ఆదివాసి సంస్కృతీ సంప్రదాయాలకు సంబంధించిన గొట్టు, గోత్రాల చెందిన వారితో పూర్తి స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇట్టి విషయంలో లీగల్ గా కూడా తమ సంఘం ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మంకిడి శ్రీను, పిరీల భాస్కర్, యానక లక్ష్మీనారాయణ, కోడి లక్ష్మీనారాయణ,ఆలం శ్రీను , కల్తీ రామకృష్ణ, గొంది రాజు తదితరులు పాల్గొన్నారు.