అశోక్ సెల్వన్ హీరోగా నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘సబా నాయగన్’. ఈ మూవీలో కలర్ ఫోటో ఫేమ్ చాందిని చౌదరి, మేఘా ఆకాష్ మరియు కార్తిక మురళీధరన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా డిసెంబర్ 22న థియేటర్ల లో రిలీజై మంచి వసూళ్లను రాబట్టింది. ఈ మేరకు వాలెంటైన్స్ డే కానుకగా బుధవారం ఈ మూవీ ఓటీటీలో రిలీజైంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ట్రెండింగ్ మూవీగా దూసుకెళ్తోంది.
