మన్యం న్యూస్ గుండాల: మూడు విప్లవ పార్టీల ఐక్యత జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని మాస్ లైన్ ప్రజాపంథా మండల కార్యదర్శి కొమరం శాంతయ్య అన్నారు. మండల కేంద్రంలో మహాసభల గోడపత్రికలను అంటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మార్చ్ 3, 4,5, తేదీలలో ఖమ్మంలో జరిగే మహాసభలకు నాయకులు పెద్ద ఎత్తున రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, మంగయ్య, సనప కుమార్, రియాజ్, జగన్, కృష్ణ, సురేష్, ఆజాద్ తదితరులు పాల్గొన్నారు