UPDATES  

 మేడారం సమ్మక్క సారలమ్మలకు చందన సుగంధ మాలలు, పట్టు వస్త్రాలు…

  • మేడారం సమ్మక్క సారలమ్మలకు చందన సుగంధ మాలలు, పట్టు వస్త్రాలు…
  •  అమ్మలకు అరుదైన గౌరవ కానుక సమర్పించిన మంత్రి సీతక్క…

మన్యం న్యూస్, మంగపేట.

 

తెలంగాణ కుంభ మేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ లకు జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి కేరళ రాష్ట్రం నుండి ప్రత్యేకంగా తయారు చేయించి తెప్పించిన చందన మాలలు సుగంధ హారాలు మరియు పట్టు వస్త్రాలను రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క చేతుల మీదగా గురువారం మేడారంలో సమ్మక్క సారలమ్మ వనదేవతలకు సమర్పించినట్లు జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి తెలిపారు.గురువారం ఉదయం ఆయన తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న అనంతరం మంత్రి సీతక్క చేతుల మీదగా అమ్మలకు నూతన వస్త్రాలు చందన సుగంధ మాలలను సమర్పించారు.ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ ఈరోజు అమ్మలను దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందిన మేడారం జాతరకి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ ఛత్తీస్ ఘడ్ ఒరిస్సా సహా ప్రపంచ నలు మూలల నుండి కోటి మందికి పైగా భక్తులు వస్తారని ఆయన అన్నారు ఇంతటి విశిష్టత ఉన్న మేడారం వన దేవతలకు కేరళ రాష్ట్రం నుండి సుగంధ హస్త కళాకారులతో ప్రత్యేకంగా రూపొందించిన సుగంధ హారాలు, చందన మాలలు మరియు పట్టు వస్త్రాలను జాతర సమయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క చేతుల మీదగా అమ్మలకు బహుకరించటం తనకు ఎంతో సంతోషంగా ఉందని సాంబశివరెడ్డి తెలిపారు.ఇది సమ్మక్క సారలమ్మ లకు లభించిన అరుదైన గౌరవ కానుకగా తాను భావిస్తున్నట్లు, అమ్మలకు సేవ చేసే అదృష్టం కలిగినందుకు సాంబ శివ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నాలుగు రోజుల పాటు వైభవంగా జరిగే మేడారం జాతరకు ప్రభుత్వం రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క చొరవతో మేడారం లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క సమ్మక్క సారలమ్మలకు సుగంధ మాలలు చందన హారాలు పట్టు వస్త్రాలు సమర్పించిన సాంబశివరెడ్డి ని అభినందించారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ పి సి సి సభ్యురాలు రవళి రెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేగా కళ్యాణి ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ లచ్చు పటేల్ నూతన కార్యవర్గ సభ్యులు వికాస్ అగ్రి ఫౌండేషన్ డైరెక్టర్లు నేలపట్ల శేషారెడ్డి చెట్టుపళ్లి తిరుపతిరావు కార్యాలయ సిబ్బంది పసుపులేటి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !