బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘డంకీ’. ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పటివరకు ఈ చిత్రం రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాకు రాజ్కుమార్ హిరానీ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.