UPDATES  

 ఏమి రామయ్య నువ్వు నడయాడిన స్థలం అమోఘం అయ్యా!!.

 

మన్యం న్యూస్ దుమ్ముగూడెం.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పర్ణశాల గ్రామపంచాయతీ లో ఎంతో కీర్తి ప్రతిష్టలను సంపాదించుకున్న రఘు రాముడు నడియాడిన నేల ఒక్కసారిగా రామాయణపు గాధల అంచులకు రాముడి చరిత్ర తీసుకెళ్తుంది. భద్రాచలానికి 36 కిలోమీటర్లు దూరంలో ఉన్న పర్ణశాల ఎంతో రమణీయంగా ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలతో పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి.

శ్రీరాముడు కథలాడిన ఈ పర్ణశాలలో ఎక్కడ చూసినా సీత అమ్మవారి గుర్తులు రఘు రాముడు నడిచిన ఖాళీ ఆనవాళ్లు పుణ్యక్షేత్రని సందర్శించడానికి వచ్చిన యాత్రికులకు ఎంతో మధురానుభూతిని ఇస్తున్నాయి. దీని చరిత్ర సాక్షాత్తు భద్రాచలం శ్రీ రాములవారి గుడి దగ్గర నుండి. ఆరంభిస్తే అయోధ్య నుండి వనవాసానికి వచ్చిన శ్రీరామచంద్ర ప్రభులవారు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసి పర్ణశాలలో సేద తీరినట్టుగా పురాణాలు చెప్తున్నాయి. సేద తీరుటకు కుటీరం ఏర్పాటు చేసిన రఘురాముడు కొంతకాలం పర్ణశాలలోనే నడి ఆడాడు అని పురాణాలు ఆ ప్రాంతపు పాతతరపు వారు చెబుతూ ఉండటం ఎంతో సూచనీయం. , రఘు రాముడు చుట్టూ ఉన్న ఆహ్లదకరమైన వాతావరణాన్ని కొండలను గుట్టలను గుట్టలలో నుంచి ప్రవహించే నది జలాలను ఎంతో ఇష్టపడ్డట్టుగా చరిత్ర చెబుతుంది. ఆనాడు జరిగిన విషయము కళ్లకు కట్టినట్టుగా ఈరోజు గోదావరి గుడికి ఆనుకొని ప్రవహిస్తున్న గోదావరి తీరు శ్రీరాముడే ఆ నదిని పంపించాడా అన్న విధంగా పాల నురగలతో పరవళ్ళు తొక్కుతూ జాలువారుతున్న ఆ గోదావరి తనలో రామాయణ గాథలు ఉన్నవి అంటూ నోరు తెరిచి చెప్తున్నట్టుగా భక్తులను ఆకర్షింప చేస్తున్నాయి. అంటూ వచ్చిన యాత్రికులు శ్రీరాముడి చరిత్రతో కూడిన బొమ్మలను చూస్తూ మంత్రముగ్ధులై వారి అనుభవాన్ని ఎంతో గొప్పగా చెప్తున్నారు.

భద్రాచలం కి వచ్చిన శ్రీరాముని భక్తులు. శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళ్ళిన స్థలమైనటువంటి పర్ణశాలను తప్పనిసరిగా సందర్శిస్తున్న ఛాయలు కనబడుతున్నాయి . ప్రతి ప్రభుత్వం కూడా పర్ణశాలలో భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించి పుణ్యక్షేత్రాన్ని ఇంకా అభివృద్ధి దశలో తీసుకపోవడంపై రాజస్థాన్ నుంచి వచ్చిన భక్తులు మరియు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు నేడు జరిగిన పర్ణశాల అభివృద్ధి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దేవుడు దర్శనానికి కొన్ని రోజుల సమయం ముందే వచ్చే తాము ఈ ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన అభివృద్ధి వల్ల ఘాట్లోని స్నానానికి వెళ్లే ప్రాంతం అంతా చిన్న పిల్లలకు ముసలివారికి కూడా యోగ్యంగా ఉన్నదని వచ్చిన భక్తులు ఆనందం వ్యక్తం చేశారు .ఇక బోట్ షికార్ చేస్తుంటే గోదావరి అందాలను దగ్గరుండి సాక్షాత్తు రఘురాముడే తన చెంతకు వచ్చి వారికి దగ్గరుండి రామాయణపు గాధలను చూపిస్తున్న భ్రాంతికి లోనవు అవుతున్నట్టుగా అనిపిస్తుంది అంటూ భక్తులు చెప్తున్నారు. అంతేకాకుండా రఘు రాముని పత్ని అయినా సీతాదేవి తాను కుటీరo లో ఉన్న ఆనాడు గోదావరి నదిలో చీర ఉతికి ఆరేసిన ఆనవాలు సైతం చూడవచ్చు అంటూ పర్యాటకులు వారి అనుభవాలని కొత్తగా వచ్చే ప్రయాణికులతో పంచుకుంటున్నారు. అడుగడుగునా రామాయణం ఆనవాళ్లను రావణుడు సీతని అపహరించిన స్థలాలను సైతం గోదారి ఒడ్డు పైన కుటీర ఆశ్రమంలో మనం చూడవచ్చు అని వచ్చిన భక్తులు యాత్రికులు రఘు రాముని రామాయణ గాధలను స్మరించుకుంటూ ప్రతి ఒక్క విషయాన్ని ఎంతో ఆనందంతో గర్భగుడిలో ఉన్నటువంటి రఘురాముని చూస్తూ విస్మయ పోతున్నారు. ఐదు కిలోమీటర్లు పడవ ప్రయాణం చేస్తూ శ్రీరాముని నామస్మరణతో మైమరిచిపోతూ భక్తులను ఇప్పటి యుగంలో కూడా తన దైవికాన్ని చాటుకుంటున్న ఈ రామాయణ గాధలను ప్రతి ఒక్కరి మనసులో పెనవేసుకుపోయేలా. రామాయణపు ఆనవాళ్లు భక్తులని మంత్రముగ్ధులను చేస్తున్న పరిస్థితులు ఇక్కడ ఉండడం చాలా ఆనందకరం. అని ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ అంటూ పర్ణశాలలో చరిత్ర పుటలను చూస్తూ మనసు నిండా ఉత్సాహంతో ప్రతి ఒక్క భక్తులు యాత్రకు ఆనందంతో శ్రీరాముని ప్రసాదాలను ఆరగిస్తూ ఇంకా సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ఇక్కడి స్మారక రామాయణ చరిత్రను గుర్తు పెట్టుకొని సనాతన ధర్మాన్ని తమ పిల్లలకు కూడా నేర్పించి మరలా వస్తే పిల్లలతో కూడా వస్తాము అంటూ. భక్తులు ఆనంద పరవశులై పోతున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !