టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీకి ‘శీలవతి’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. గతంలో వీరి కాంబినేషన్‌లో ‘వేదం’ మూవీ వచ్చింది. కాగా, ఒడిశాలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోనున్నట్లు సమాచారం.
