మన్యం న్యూస్, మంగపేట.
రాష్ట్రంలో వివిధ విభాగలలో పని చేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను ప్రభుత్వం క్రమబద్దీకరించాలని తెలంగాణ ప్రోగ్రెస్సివ్ టీచర్స్ ఫెడరేషన్ మంగపేట మండల అధ్యక్షులు లావుడ్యా రమేష్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ విద్యా వ్యవస్థకు వెన్నెముకగా సమగ్ర శిక్ష ఉద్యోగులు పని చేస్తున్నారు అన్నారు. కేజీబీవీలలో పని చేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది బాలికల విద్యా కోసం విశేషంగా కృషి చేస్తున్నారు అన్నారు.మండల విద్యా వనరుల కేంద్రంలో సిఆర్పిలుగా విద్యారంగంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. పాఠశాలలో పిటిఐ లుగా విద్యార్థులకు సేవలు అందిస్తున్నారు .భవిత కేంద్రాలలో దివ్యాంగుల విద్యార్థులకు ఐఈఆర్పి గా సేవలు అందిస్తున్నారు తెలియజేశారు.ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు పని చేస్తున్న కూడా వేతనాలు చెల్లించడంలో అంతరాలు చూపించడం చాలా బాధాకరం అన్నారు.సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన కూడా ప్రభుత్వాలు పట్టించుకోకుండా సమగ్ర శిక్ష ఉద్యోగులను శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారు అన్నారు.ప్రభుత్వం సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు చేస్తున్న సేవలను గుర్తించి క్రమంబద్దికరించి, కనీస వేతనం చెల్లించాలని తెలియజేశారు.