మన్యం న్యూస్ గుండాల: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం, అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజలంతా పోరాడాలని న్యూ డెమోక్రసీ నాయకులు ఎంపీపీ ముక్తి సత్యం అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎస్బిఐ బ్యాంక్ ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రం తీసుకువచ్చిన మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని అన్నారు. రైతులకు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కోరం సీతారాములు, పరిశిక రవి, వై వెంకన్న, గడ్డం లాలయ్య, నానాల ఉపేందర్, అస్గర్, గడ్డం నగేష్, చేబోతు రవి, బాల్య కిరణ్ తదితరులు పాల్గొన్నారు
