మన్యం న్యూస్, మంగపేట.
ఫిబ్రవరి 28 న జాతీయ సైన్స్ డే సందర్భంగా జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యాశాఖ సహకారంతో వైజ్ఞానిక ప్రదర్శన శాల ఏర్పాటు చేయడం జరుగుతుంది.మంగపేట మండలంలోని అన్ని పాఠశాల లకు ఆహ్వానం ఇవ్వడం జరిగింది. ఈ కారిక్రమం మండల కేంద్రంలోని ఎం ఆర్ ఓ ఆఫీస్ పక్కన నూతన కే జి బి వి బిల్డింగ్ లో ఏర్పాటు చేయడం జరుగుతుంది.ట్రస్ట్ గౌరవసలహదారులు కోలగట్ల నరేష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల చేత ఎక్కువ ప్రయోగ కృత్యమలు చేయించి మండలంలోని విద్యార్థులందరిలో శాస్త్రీయ దృక్పథం పెంచడానికి సహకరించాలని తద్వారా విజ్ఞానం పెంపోందించుకోవాలని తెలిపారు.ఈ సందర్బంగా మా జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ తరుపున ఆహ్వానం పలుకుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జ్వాలాచారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్ , ప్రధానకార్యదర్శి మునిగాల రాకేష్ గారు,గౌరవసలహదారులు ఈక రాజేష్ గారు, కార్యవర్గ సభ్యులు ఓదెల సుధీర్,ఇంతీయాజ్ తదితరులు పాల్గొన్నారు.