ప్రియమణి నటించిన భామా కలాపం-2 చిత్రానికి ‘ఆహా’లో మంచి స్పందన వస్తోంది. నిన్న నేరుగా ఓటీటీలో విడుదల కాగా, 24 గంటల్లోనే 50+ మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ నమోదైనట్లు మేకర్స్ వెల్లడించారు. రూ.కోట్ల విలువైన కోడి బొమ్మ దొంగతనం కేసు నేపథ్యంలో కామెడీ థ్రిల్లర్ సినిమా తెరకెక్కింది. ఇందులో ఫిదా ఫేమ్ శరణ్య, సీరత్ కపూర్, రఘు ముఖర్జీ కీలక పాత్రల్లో నటించారు.
