తనదైన నటనతో తండ్రికి తగ్గ తనయగా హీరోయిన్ శృతిహాసన్ సినిమాలు చేస్తూ తన కెరీర్ ను కొనసాగిస్తోంది. చిన్న, పెద్ద అనే బేధాలు లేకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. తాజాగా తన తండ్రి కమల్ హాసన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను శృతి పంచుకుంది. సినిమా విషయంలో ప్రయోగాలు చేయాలంటే నాన్నకే సాధ్యమన్నారు. చాలా మంది కొత్త మార్గాల్లో ప్రయాణం చేయాలని అనుకుంటారు. కానీ, వేరే నటులకు అది సాధ్యం కాదన్నారు. కథల ఎంపిక విషయంలో నాన్న ఇతర నటులకు భిన్నంగా ఉంటుందన్నారు.
