తెలుగుచిత్ర పరిశ్రమలో యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి అందరికీ తెలుసు. ప్రేమ, వినోదం పండించే సినిమాలతో విశ్వక్ యువతకు ఎంతో దగ్గరయ్యారు. విశ్వక్ హీరోగా ‘గ్యాంగ్ గోదావరి’ సినిమా మార్చ్ నెలలో రాబోతుంది. ఈ సందర్బంగా ఈ యంగ్ హీరో పలు ఇంటర్వ్యూల్లో తన అనుభవాలను పంచుకుంటున్నాడు. ఈ క్రమంలో తన అసలు పేరును బయటపెట్టాడు. సినిమాల కోసం దినేష్ నాయుడిగా ఉన్న తన పేరును విశ్వక్ సేన్ గా మార్చుకున్నట్లు చెప్పుకొచ్చాడు.
